నటి దివ్యవాణి అసలు పేరు ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి సింగల్ టేక్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి దివ్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? దివ్యవాణి అసలు పేరు ఏంటి? అనే విషయానికి వస్తే.. దివ్యవాణి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ఈమె ఆదినారాయణ రావు విజయలక్ష్మి దంపతులకు జన్మించారు.వీరు ముగ్గురు సంతానం దివ్యవాణికి ఒక అక్క అన్నయ్య ఉన్నారు. దివ్యవాణి సోదరి బేబీ వాణి ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా ఈమె సెలవల సమయంలో తన అక్కతో పాటు షూటింగ్ లోకేషన్లకు వెళ్లడం వల్ల ఈమెను చూసిన పలువురు తనలో ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయంటూ పొగిడేవారు. అయితే ఒక రోజు శారద దివ్యవాణిని చూసి తనలో ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని తనకు మేకప్ వేయమని చెప్పారు. ఈ విధంగా శారద చెప్పినట్టే దివ్యవాణి తల్లి తనకు బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి మేకప్ వేయించారు. ఇకపోతే ఈమె కృష్ణ నటించిన సర్దార్ కృష్ణమనాయుడు సినిమాలో కృష్ణ కూతురిగా వెండితెర అరగటం చేశారు. అప్పటివరకు ఈమె ఇండస్ట్రీలో తన అసలు పేరు ఉషావానితో కొనసాగుతున్నారు.

అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన డాన్స్ రాజా డాన్స్ అనే సినిమా దర్శకుడు ఉషా వాని పేరును దివ్యవాణిగా మార్చారు. ఇలా అప్పటి నుంచి ఈమె దివ్య వాణిగా ఇండస్ట్రీలో ఉండి పోయారు. ఈ విధంగా ఈమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే నటిగాను నటించారు. ఇలా ఉషా వానిగా ఉన్నటువంటి ఈమె దివ్య వాణిగా మారిపోయారు. ఇకపోతే ఈమె బాబు గారి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి పుస్తకం సినిమా ద్వారా బాబు గారి బొమ్మలాగే అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.