అనుపమ ఆగనంటోంది .. అన్నీ చూపించేస్తుందట ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ముందు నుంచి వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ సక్సస్ లను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని కూడా క్రియోట్ చేసుకున్నాడు. ఆ మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని అర్జున్ సురవరం సినిమాతో సక్సస్ అందుకున్నాడు. ఈ సినిమాకి ముందు చేసిన కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సస్ లు అందుకున్న నిఖిల్ మళ్ళీ వరసగా సినిమాలు చేస్తున్నాడు.

Anupama Parameswaran To Pair With Nikhil In 18 Pages - Social News XYZ

గతంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ ని రూపొందిస్తుండగా ఈ కార్తికేయ 2 సీక్వెల్ లో కూడా నిఖిల్ నటిస్తున్నాడు. కార్తికేయ ని తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ నటిస్తున్న మరో సినిమా 18 పేజీస్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు.

ఈ కాంబినేషన్ లో ఇంతక ముందు 100 % ల‌వ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీత‌గోవిందం, ప్ర‌తి రోజు పండ‌గే వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నిర్మాణంలో బ‌న్నీ వాసుతో భాగస్వామిగా వ్య‌వ‌హ‌రిడంతో పాటు క‌థ‌, స్క్రీన్ ప్లే ని దర్శకుడు సుకుమార్ అందివ్వడం విశేషం.

ఇక ఈ సినిమాకి ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అన‌పమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఎంచుకున్నారు. నిఖిల్, అనుప‌మ జోడి ప్రేక్షకులని అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా అనుపమ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తుందని ఇన్నాళ్ళు చేసిన సినిమాలకంటే డిఫ్రెంట్ రోల్ చేస్తుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమా తర్వాత అనుపమ కెరీర్ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేస్తుందని ధీమాగా ఉందట.