రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ కి సరైన పోటీని ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్న నటుడు రవి కిషన్. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఒకసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసిన నటుడు రవి కిషన్ నిజానికి భోజ్ పురి వ్యక్తి. భోజ్ పురిలో స్టార్ నటుడు అయిన రవి కిషన్ రాజకీయ నాయకుడు కూడా. రాజకీయంలో అడుగుపెట్టిన తరువాత సినిమాలని తగ్గించిన రవి కిషన్ బోజ్పురి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన వంతుగా సహకారం అందించిన వారిలో ముందు ఉంటాడు.
ఈ మధ్యనే రవిశంకర్ ఢిల్లీలోని సాహిత్య ఆజ్ తక్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అక్కడ భోజపురి ఇండస్ట్రీ గురించి తన ఆవేదన వ్యక్తం చేశాడు రవి కిషన్. పరిశ్రమ అభివృద్ధిలో తాను ఎలా భాగం అయ్యాడో వివరించడమే కాక కోల్పోయిన ప్రతిష్ట గురించి అసహనం వ్యక్తం చేశాడు. తాను భోజ్ పురి సినిమాలో మూడవ జనరేషన్ ప్రారంభించానని తన జూనియర్లకు అన్ని ఏర్పాట్లు చేసాం అని కానీ వారు దానిని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నాడు.
దురదృష్టవశాత్తు నేను నా జూనియర్స్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాను, వారు భోజ్ పురి సినిమా ప్రతిష్టను చెడగొట్టారు. భోజ్ పురి 25 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భోజ్ పురి సినిమా చాలామందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోందని అయినప్పటికీ ఆ ఇండస్ట్రీని చాలామంది చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు ఇండస్ట్రీలో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు, నాకంటే జూనియర్ నటులు బొంబాయికి వెళ్లే సమయానికి నేను ఇప్పటికే వారికి వేదికను సిద్ధం చేశాను అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను నటుడిని అవుతాను అంటే తన తండ్రి ఎలా వ్యతిరేకించాడో కూడా చెప్పాడు. రవి కిషన్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భోజ్ పురి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు తర్వాత అతను పలు భాషలలో నటించి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే.