బిగ్ బాస్ తెలుగు తాజా సీజన్ ఎండింగ్ కి వస్తోన్న క్రమంలో హీట్ పెరింగింది. బిగ్ బాస్ తాజా సీజన్ గురించి, కంటెస్టెంట్ల గురించి, విజేత గురించి పలువురు సెలబ్రిటీలు చెసే కామెంట్స్ వైరలవుతున్నాయి. తాజాగా యాంకర్ వర్షిణి తాను బిగ్ బాస్ షోకు అభిమానిని అని చెప్పింది. అందంలో హీరోయిన్స్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే ఈ భామ ఎందుకో బుల్లి తెర వద్దే ఆగిపోయింది. కాగా తాజాగా దీపావళి సందర్భంగా యాంకర్ రవి… వర్షిణిని ఇంటర్వ్యూ చేశాడు. వర్షిణితో పాటు ఆమె సోదరిని సౌజన్యను కూడా భాగం చేశాడు. ఇందులో ఈ ముగ్గురు కలిసి బిగ్ బాస్ నాల్గో సీజన్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నారు.
కాగా వర్షిణికే కాదు ఆమె అక్క సౌజన్యకు కూడా సీజన్ 4 లో అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్ అట. ఇక వర్షిణికి అభిజిత్ తో స్పెషల్ బాండింగగ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో ‘పెళ్లి గోల’ అనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది. మూడు సీజన్లుగా వచ్చిన ఈ వెబ్ సిరిస్ ప్రేక్షకులను ఆకట్టకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి చాలారోజులు ప్రొఫిషనల్ జర్నీ చేశారు. అందుకే అభిజిత్ గురించి చాలామంది బయట జనాలకు తెలియని అంశాలు ఈమెకు తెలుస్తాయి. కాగా బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు అభిజిత్ వర్షిణికి ఫోన్ చేశాడట. బిగ్ బాస్ షో వాళ్లు రమ్మంటున్నారు వెళ్లాలా? వద్దా? ఎలా అడిగాడట. టీవీ ఇండస్ట్రీలో తాను పనిచేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుంది అని అడిగాడట. ” నువ్ చాలా స్మార్ట్.. బాగా ఆలోచిస్తావ్.. వెళ్తే బాగుంటుంది” అని వర్షిణి ఆన్సర్ ఇచ్చిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అభిజిత్ కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టమో చెప్పమంటే అరియానా అని వర్షిణి ఆన్సర్ ఇచ్చింది. అయితే తనకు అభిజిత్ ఫ్రెండ్ కాబట్టి.. అతనే గెలవాలని కోరుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే వర్షిణి సిస్టర్ మాత్రం అరియానా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇంత వరకు లేడీ కంటెస్టెంట్లు విజేతగా నిలవలేదు.. అరియానా టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఆమె వివరించింది. ప్రజంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అభిజిత్ టాప్ ప్లేసులో ఉన్నాడు. కానీ సీన్ రివర్స్ అవ్వడానికి ఒక్క సందర్భం చాలు. ఎమో బిగ్ బాస్‌కు తిక్కరేగితే అభిజిత్ ఎలిమినేట్ కూడా అవ్వవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.