బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ మొత్తానికి తన క్రేజ్ ను కూడా గట్టిగానే పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా అందుకోని రేంజ్ లో ఓట్లు కూడా అందుకున్నడు. నిజంగా బిగ్ బాస్ సీజన్ 4 అతనికి ఒక బ్లాక్ బస్టర్ లాంటి హిట్టు ఇచ్చింది. అదే విధంగా బిగ్ బాస్ ద్వారా అతనికి వచ్చిన అందిన కూడా ఎక్కువే.
మొదట లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తరువాత కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేశాడు. అవేవి కూడా కెరీర్ స్థాయిని పెంచలేదు. ఇక కరెక్ట్ టైమ్ లో బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు. అభి గెలవడం కోసం బ్యాక్ గ్రౌండ్ లో గట్టిగాబే ఖర్చు పెట్టినట్లు టాక్ వచ్చింది. ఒక డిజిటల్ మీడియాకు ప్రమోషన్ లో భాగంగా దాదాపు 50లక్షల వరకు ప్యాకేజ్ ఇచ్చాడట.
ఇక అభికి ప్రమోషన్ విషయంలో మాత్రం పెద్దగా మైనస్ పడలేదు. దానికి తోడు అతనికి అభిమానులు కూడా పెరిగారు. మొత్తంగా 105రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగిన అభికి 60లక్షల వరకు అందిందట. ఇక ప్రైజ్ మని అయితే 25లక్షలు. ఆ విధంగా మొత్తం 85లక్షలు అందుకున్నాడు. అలాగే ఒక ఖరిదైన బైక్ కూడా గెలుచుకున్నాడు. దాని విలువ 2లక్షల 94వేలు ఉంటుంది. ఇక బిగ్ బాస్ ప్రమోషన్ కోసం దాదాపు 50లక్షలు ఖర్చు చేసిన అభికి పెట్టిన పెట్టుబడి 35లక్షలు మిగిలిందనే చెప్పాలి. ఇక వచ్చిన క్రేజ్ ను బట్టి చూస్తే మనోడికి సినిమా ఆఫర్స్ ఎంతో దూరంలో లేవని అర్ధమవుతోంది.