HomeEntertainmentఆది 'శశి' టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ !

ఆది ‘శశి’ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ !

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ శశి. కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ఆది సరసన సురభి, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Samayam Telugu | Telugu Rajyam

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ చివరి దశకి చేరుకుంది. అతి త్వరలో విడుదల కాబోతున్నఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర టీజర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. నేడు ఆది జన్మదినోత్సవం కానుకగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆదికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు చిరంజీవి.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఆది సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. `మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి`, `ఇష్టమైన పని చేయడానికి.. అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉంది` లాంటి డైలాగ్స్ ఈ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News