దసరాకి బాలయ్య సినిమాలో ఊహించని సర్ప్రైజ్ అట..!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న దసరా కానుకగా పలు భారీ చిత్రాలు రేస్ లో ఉండగా వాటిలో టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రామా “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

కాగా ఈ భారీ చిత్రం ట్రైలర్ పాటలు అన్నీ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకోగా ఫ్యాన్స్ ఇప్పుడు చాల ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దసరా మహోత్సవం మొదలయ్యే వారంలోనే ఈ చిత్రం విడుదల ఉండగా మధ్యలో దసరా కూడా రానుంది.

దీనితో చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి ఓ క్రేజీ అప్డేట్ ని రివీల్ చేసాడు. తాను మాట్లాడుతూ దసరా కి ముందు వచ్చే సినిమాలో ఓ సాంగ్ ఉండదు అని కానీ సరిగ్గా దసరా రోజు అయితే ఒక సూపర్ మాస్ సాంగ్ ని తాము యాడ్ చేస్తున్నామని దీనితో ప్రతి ఒక్కరూ ఎంతాగాబో ఎంజాయ్ చేస్తారని అనిల్ రావిపూడి తెలిపాడు.

మొదటి వారం హానెస్ట్ గా చూసి రెండో వారం అందరం ఎంజాయ్ చేద్దామని అంటున్నాడు. మరి థమన్ చేసిన ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాగా ఈ చిత్రంలో శ్రీలీల కూడా నటిస్తుంది. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మాణం వహించారు.