టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న భారీ చిత్రాల్లో తన ఫాన్ దర్శకులు ఇద్దరితో చేస్తున్న సినిమాలే రెండు ఉన్నాయి. ఒకటి దర్శకుడు సుజీత్ తో చేస్తున్న “ఓజి” కాగా మరో చిత్రమే దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ “ఉస్తాద్ భగత్ సింగ్”.
మరి ఈ సినిమాల్లో ఇపుడు పవన్ ఉస్తాద్ పై ద్రుష్టి పెట్టగా హైదరాబాద్ లో అయితే సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఓ క్రేజీ ఏక్షన్ బ్లాక్ లో పాల్గొన్న పవన్ ఈరోజు అయితే బ్రేక్ ఇచ్చాడు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఐతే ఓ షాకింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని ఎప్పుడు ఎలా చేసారో కానీ ఆల్రెడీ ఈ సినిమా ఏకంగా 40 శాతం మేర పూర్తయిపోయిందట. ఇది నిజంగా ఊహించనిదే అని చెప్పాలి. స్టార్ట్ చేసిన మొదట్లో ఓ రెండు వారాలు షూట్ చేసినట్టు ఉన్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఇదే మొదలు ఈ తక్కువ టైం లో కూడా ఇంత షూటింగ్ అంటే ఆశ్చర్యకరమే అని చెప్పాలి.
ఇక ఇప్పటికే వరుసగా ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా సినిమా నుంచి రిలీజ్ చేస్తున్నారు. మరి సినిమాని అయితే ఎప్పటికి రిలీజ్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ చిత్రంలో శ్రీలీల, సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.