లేటెస్ట్ గా పుష్ప లొకేషన్ నుంచి లీకయిన ఫొటో .. సుకుమార్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ..!

ఒక సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు లొకేషన్ నుంచి కొన్ని ఫొటోస్ గాని వీడియోలు గాని లీకవడం కొన్ని సార్లు దర్శక, నిర్మాతలని అసహనానికి గురి చేస్తాయి. ప్రేక్షకులను దృష్ఠిలో పె ట్టుకొనే ఫ్యాన్స్ ని తమ అభిమాన హీరోని కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఎంతో కష్ఠపడి దర్శకులు, రచయితలు ఒక కథ రాసినప్పుడే అందుకో హీరో పాత్ర ఇలా ఉండాలని, మేకోవర్ ఇలా అయితే ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతారని చాలా రకాలుగా ఆలోచించి హీరోకి ఒక గెటప్ ఫిక్స్ చేస్తారు.

Pushpa: Makers shares a glimpse of Allu Arjun as he resumes shoot after  lockdown | PINKVILLA

టైటిల్ పోస్టర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ .. ఇలా తాజా అప్‌డేట్స్ తో ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేయాలనుకుంటారు. కాని ఇంతలోనే లొకేషన్స్ నుంచి ఎలాగోలా హీరో గాని హీరోయిన్ గాని చిత్రీకరణలో ఉన్నప్పుడు ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. ఇది సినిమాకి చాలా రకాలుగా ఇబ్బందులను తెచ్చిపెడుతుందని మేకర్స్ ఫీలవుతున్నారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. మారేడుపల్లి లోని ఫారెస్ట్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాగా రీసెంట్ గా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ లుక్ లీకయింది. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ చాలా ఫీలయ్యాడని యూనిట్ లో అందరికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు.

Stylish Star Becomes Shabby And Dusty For Pushpa

ఇక ఈ సినిమాని సమ్మర్ కి రెడీ చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఫారెస్ట్ లో జరుగుతున్న లాంగ్ షెడ్యూల్ తో సగానికి పైగా టాకీపార్ట్ కంప్లీటవుతుందట. మిగతా భాగాన్ని హైదరాబాద్ లో కంప్లీట్ చేయనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ చేశాక అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే సుకుమార్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే.