ఎన్టీఆర్ “దేవర” లో ఓ మాసివ్ సాంగ్..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి తెరకెక్కుతున్న పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ దీనిని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏకంగా హాలీవుడ్ లెవెల్ హంగులను కలిపి తీర్చి దిద్దుతుండగా అవ్వడానికి చాలా లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ..

ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ స్పీడ్ లో అది కూడా పక్కా ప్లానింగ్ లో కంప్లీట్ అవుతూ దూసుకెళ్తూ ఉండడం విశేషం. కాగా ఈ చిత్రం పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. దీనితో సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాలో ఓ మాసివ్ నెంబర్ ని కంపోజ్ చేయగా దానిని దర్శకుడు కొరటాల శివ అంతకు మించి గ్రాండ్ గ భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

ఏకంగా 2000 మందికి పైగా డాన్సర్స్ తో ఈ పర్టిక్యులర్ సాంగ్ ని అయితే ప్లాన్ చేశారట. ఇప్పుడు ఈ సాంగ్ షూట్ కొనసాగుతూ ఉండగా అదిరే డాన్స్ మూమెంట్స్ తో అంత మంది డాన్సర్స్ మరియు ఎన్టీఆర్ తో కలిపి నాటు నాటు డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ సారథ్యంలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి సాంగ్ ఏ లెవెల్లో ఉంటుందో..