ఆ భారీ సెట్ చూడటానికి రెండు కళ్ళూ చాలవంతే .. పరుగులు పెడుతున్న ఆచార్య షూటింగ్ ..!

రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ తిరిగి మొదలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాని పెద్ద ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. అసలే మెగాస్టార్ తో సినిమా. ఏ ఒక్క అంశంలోను లోటు ఉండకూడదు. పైగా కొరటాలకి కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా ఆచార్య. మరోసారి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకే మెగాస్టార్ సినిమా విషయంలో కొరటాల మనసులో ఉన్న స్టఫ్ మొత్తం ఆచార్య కి వాడుతున్నాడని చెప్పుకుంటున్నాడు.

Vijay in Chiranjeevi Acharya – Precious first-time opportunity - tollywood

పాన్ ఇండియన్ లెవల్ లో భారీ సక్సస్ కొట్టాలన్న కసి… ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒకటైతే ఇప్పుడు మెగాస్టార్ తో చేస్తున్న ఆచార్య ఒకటే ఒకెత్తు అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాని సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక సెట్ ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ సెట్ చూడటానికి రెండు కళ్ళు చాలవంటున్నారు. ఇప్పటి వరకు సెట్స్ అంటే అందరికి గుర్తొచ్చేది ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ అలాగే అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్. ఇప్పుడు ఆచార్య సినిమాకోసం కూడా భారీ బడ్జెట్ తో ఒక ఆలయం సెట్ ని నిర్మించారని సమాచారం. పలు కీలకమైన సన్నివేశాలను ఈ సెట్ లోనే తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.