ఇండస్ట్రీ టాక్ : ‘ఓజి’ నుంచి సరైన ఫీస్ట్ రాబోతోందా?

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తునం హై బడ్జెట్ చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా చిత్రం “ఓజి” కూడా ఒకటి. పవన్ కెరీర్ ఓ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామాగా దీనిని ప్లాంక్ చేస్తుండగా మేకర్స్ అయితే ఊహించని ఎలిమెంట్స్ తో దీనిని నిర్మాణం వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రం విషయంలో ఇదివరకే పవన్ పుట్టినరోజు కానుకగా అయితే ఓ భారీ ట్రీట్ ని ఇస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ఓ ఇంటెన్స్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2 న అయితే ఈ చిత్రం నుంచి సరైన ఫీస్ట్ నే మరో లెవెల్ హైప్ ఎక్కించే దానిని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రంలో కోలీవుడ్ వాయిస్ బేస్ ఆర్టిస్ట్ అర్జున్ దాస్ తో అయితే మాసివ్ టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట. అర్జున్ దాస్ వాయిస్ కి గాని తాను తన వాయిస్ లో ఇచ్చే ఎలివేషన్స్ కి కానీ మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ చిత్రంలో కూడా తాను సాలిడ్ పాత్ర చేస్తుండగా ఈ టీజర్ ను తన వాయిస్ ఓవర్ లోనే పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే పాన్ ఇండియా లేదంటే తెలుగు నుంచే ఉండే ఛాన్స్ ఉందట. మరి చూడాలి ఈ సినిమా నుంచి సుజీత్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అనేది. ఇంకా ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే RRR నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.