మెగాస్టార్ “భోళా శంకర్” నుంచి లేటెస్ట్ బిగ్ అప్డేట్.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ లు హీరోలుగా నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ సినిమా హిట్ తో మెగాస్టార్ నెక్స్ట్ రీమేక్ సినిమాకి మంచి హైప్ వచ్చేసింది.

దీనితో ఈ సినిమా కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాని దర్శకుడు మెహర్ రమేష్ తమిళ వేదాళం కి రీమేక్ గా అయితే తెరకెక్కిస్తున్నారు. మరి ఈ మాస్ ప్రాజెక్ట్ నుంచి అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని అందించేసారు.

మెగాస్టార్ పై డాన్స్ చేస్తూ అలా స్టైలిష్ గా నించున్న పోస్టర్ ని రిలీజ్ చేసి ఓ సాంగ్ నుంచి హుక్ స్టెప్ ఉన్నప్పుడు హింట్ ఇచ్చారు. అంతే కాకుండా దీనితో ఈ సినిమా నుంచి అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా భోళా శంకర్ మ్యూజిక్ మేనియా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపారు.

దీనితో అయితే మరికొన్ని రోజుల్లోనే అదిరే సాంగ్స్ వినబోతున్నామని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అయితే టాలీవుడ్ లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించగా తన మ్యూజిక్ పై కూడా అంతా నమ్మకం పెట్టుకున్నారు.

ఎందుకంటే తాను మణిశర్మ కొడుకు కావడం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి తన తండ్రి లాంటి ట్యూన్స్ మెగాస్టార్ కి ఇస్తాడా లేదా చూడాలి. కాగా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కీలక పాత్ర చేస్తుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు.