‘దసరా’లో కీర్తి సురేష్ నట విశ్వరూపమేనట.!

‘దసరా’ సినిమా విషయంలో హీరో నాని చుట్టూనే ప్రమోషన్స్ నడుస్తున్నాయ్. వాస్తవానికి ఇంకా ప్రమోషన్స్ జోరుగా సాగడంలేదనొచ్చేమో.! ఇంతకీ, హీరోయిన్ కీర్తి సురేష్ ఎక్కడ.? ఇప్పుడిప్పుడే, ఆమె కూడా ప్రమోషన్స్ కోసం సందడి చేస్తోంది.

అసలు ఇన్ని రోజులు ఎందుకు కీర్తి సురేష్ విషయంలో స్తబ్దత నెలకొంది.? అంటే, అది స్తబ్దత కాదు.. వ్యూహాత్మకంగానే ఆమెను సైలెంట్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా చాలా కొత్తగా వుండబోతోందిట. ఇప్పటిదాకా ఎప్పుడూ కీర్తి సురేష్‌ని ఇలా చూడలేదనే భావన సినిమా చూసిప ప్రతి ఒక్కరికీ కలుగుతుందట.

ఒక్కమాటలో చెప్పాలంటే, కీర్తి సురేష్ నట విశ్వరూపాన్ని ‘దసరా’ సినిమాలో చూడబోతున్నామనీ, ఆమె పాత్రని దర్శకుడు చాలా బలంగా తీర్చిదిద్దాడనీ అంటున్నారు. ‘అవార్డులు ఆమె కోసం క్యూ కడ్తాయ్..’ అంటూ ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి సమాచారం అందుతోందంటే, ‘దసరా’లో కీర్తి సురేష్ ఏ స్థాయిలో చెలరేగిపోయిందో ఏమో కదా.!