కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తరువాత అత్యదిక మార్కట్ ఉన్న హీరోల్లో ఇప్పుడు విజయ్ చేరాడు. ఒక విధంగా ఇటీవల కాలంలో తలైవా మార్కెట్ తగ్గుతుంటే ఇళయదలపతి రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ మూడు వందల కోట్ల బిజినెస్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక 2020 బెస్ట్ మూమెంట్స్ లో కోలీవుడ్ జనాలు మరచిపోలేని విషయాల్లో విజయ్ అభిమానులతో తీసుకున్న సెల్ఫీ ఒకటి.
మాస్టర్ సినిముఖ్ఆ షూటింగ్ సమయంలో వేలాది మంది యువ అభిమానులు ఒక్కసారిగా లొకేషన్ కు వచ్చారు. అప్పుడు విజయ్ వారితో దిగిన సెల్ఫీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2020లో ఇండియాలోనే అత్యధికంగా రీట్వీట్స్ పొందిన ట్వీట్ గా రికార్డుకెక్కింది. 158.1k రీ ట్వీట్స్ వచ్చాయి అంటే విజయ్ హవా ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ స్థాయిలో క్లిక్కవ్వడానికి ఒక కారణం ఉంది.
అప్పుడు అభిమానులు ఎందుకు వచ్చారు అంటే.. ఆ మధ్య తరచు ఆదాయపన్ను అధికారులు విజయ్ ఇంటిపై సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. గత సినిమాల తాలుకు కలెక్షన్స్ విషయంలో నిర్మక్తతో కలిసి పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు కూడా క్రియేట్ చేశారు. ఇక ఐటి డిపార్ట్మెంట్ దాడితో అక్కడ ప్రభుత్వాలకు షాక్ ఇచ్చేలా అభిమానులు విజయ్ కు మద్దతు పలికారు. ఇక లొకేషన్ లో అభిమానులతో దిగిన సెల్ఫీ 2020 బెస్ట్ ఫొటోగా ఇండియన్ ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసింది.