Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. 2025లో సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇప్పటీకే ఫిల్మ్ మేకర్స్ ‘జరగండి జరగండి’, ‘రా మచ్చా మచ్చా’ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో హైప్ పెంచారు. నెక్ట్స్ ఓ మెలోడీ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాటను నిర్మించటానికి నాలుగు చిన్న సినిమాలను నిర్మించే బడ్జెట్‌లో చేశారట. దీంతో అందరు నోటిపై వేలేసిన.. డైరెక్టర్ శంకర్‌కి ఇది మామూలు విషయం.
Ram Charan
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ‘జరగండి జరగండి’ సాంగ్ యూట్యూబ్‌లో 45 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి హిట్‌గా నిలిచింది. ఇటీవల రిలీజ్ చేసిన ‘రా మచ్చా మచ్చా’ లిరికల్ సాంగ్ కూడా 35 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ లో రచ్చ రేపింది. అయితే నవంబర్‌లో ఈ సినిమాకి సంబంధించిన నెక్ట్స్ సాంగ్ ఒక లిరికల్ మెలోడీని విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు.
Game Changer – Thandel: ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా ‘తండేల్’ విడుదల!?
అయితే గ్రాండ్ విజువల్స్‌తో షూట్ చేసిన ఈ పాటకి అక్షరాలా రూ. 20 కోట్లు ఖర్చయిందట. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్న కోలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం శంకర్ (Director Shankar) సినిమా అంటే ఇదంతా సర్వసాధారణం అంటున్నారు. మరి 20 కోట్లు ఏంటి.. దీంతో నాలుగు చిన్న సినిమాలు నిర్మించొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు అంటున్నారు మెగా అభిమానులు.
‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను భారతీయ సినీమా చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తన మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారు. ఇందులో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో (Ram Charan) కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు.. ఇందులో భాగం అయ్యారు.