Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే తన వందవ సినిమాని ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 99 సినిమాలలో హీరోగా నటించిన నాగార్జున ఎన్నో సినిమాలలో అతిథి పాత్రలలో కనిపించి సందడి చేశారు. ఈయన హీరోగా త్వరలోనే 100 వ సినిమా రాబోతుంది ఈ సినిమా నాగార్జునకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పాలి.
ఇక నాగార్జున తన 100వ సినిమాకు తెలుగు దర్శకులను కాకుండా తమిళ దర్శకులకు అవకాశం ఇవ్వటం గమనార్హం.తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడట డైరెక్టర్. అంతే కాకుండా.. ఇది నాగార్జున కెరీర్‌లో సెంచరీ మూవీ కావడంతో.. ఈ చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నాగార్జున 100వ సినిమాకి అదిరిపోయే టైటిల్స్ ఫిక్స్ చేశారని సమాచారం. ఎక్స్‌క్లూజివ్.. నాగ్ 100వ చిత్రానికి ‘కింగ్ 100 ఫిక్స్. ఈ ల్యాండ్ మార్క్ మూవీకి రాక్‌స్టార్ DSP సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆగస్ట్ 2025లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది.
ఇకపోతే నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కుబేర సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున త్వరలోనే రజినీకాంత్ నటించిన కూలీ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో కూడా ఈయన పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.