డిజే టిల్లు సీక్వెల్ లో శ్రీలీలా అవుట్ అనుపమ ఇన్.. అసలు విషయం చెప్పిన మేకర్స్?

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ తో పాటు నేహా శెట్టి అందం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

దీంతో ఈ సినిమా సీక్వెల్ తీయాలని నిర్మాతలు భావించారు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డీజే టిల్లు 2 లో నేహా శెట్టి స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకున్నారు. మొదట ఈ సినిమాలో అందాల నటి శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్ గా మరి తన అందంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీ లీల ప్రస్తుతం తెలుగు కన్నడ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. దీంతో డీజే టిల్లు సినిమాలో నటించటం వల్ల డేట్స్ క్లాష్ అయ్యే అవకాశాలు ఉంటాయని శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సమాచారం. దీంతో వెంటనే ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసి షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.