అల్లు స్నేహ పుట్టినరోజులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బన్నీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.పుష్ప సినిమాతో ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అల్లు అర్జున్ తన కూతురు కొడుకుతో కలిసి తన భార్య చేత కేక్ కట్ చేయించారు.ఈ ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే క్యూటీ అంటూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే నేడు అల్లు స్నేహ పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ తన భార్య కొడుకు కూతురుతో కలిసి అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయంలో స్వామివారి దర్శనం అనంతరం వీరు బయట సందడి చేశారు.ప్రస్తుతం అల్లు అర్జున్ అమృత్ సర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.

అల్లు అర్జున్ అల్లు స్నేహాను ప్రేమించి 2011 వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ స్నేహ మాత్రం తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంటారు.