ష్, హోం వర్క్ ఇలా కూడా చేయవచ్చు, వైరల్ వీడియో

ఈ కాలం స్కూలంత ఇన్స్పైరింగ్ ప్రదేశమేమికాదు. చాలా మంది పిల్లలు బలవంతంగా బడికెళ్తుంటారు.పొద్దున్నే, ఇంకా నిద్రమత్తు వదలక ముందే బండెడు పుస్తకాలు మోస్తూ బడిబస్సు బలవంతం తూలుతూ ఎక్కెే ప్రతిపిల్లవాడు శిలువ మోస్తున్న బాలయేసులా కనబడి తీరాలి. బడి బతుకును దుర్భరం చేసిన అంశాలు చాలా ఉన్నా, అన్నింటికంటే అధ్వాన్నమయింది హోం వర్క్. ఇంటిని మొత్తం నరకం చేసిన స్కూల్ యాక్టివిటి ఇది. బడిలో నీకు ఏ మాత్రం ఇష్టం లేని పనేమయిన ఉందా అనిఏ పిల్ల వాణ్ణడిగినా హోం వర్క్ అని టకీమని చెప్పేస్తాడు. ఈ విషయం ప్రతి ఇల్లు పిల్లాడి వెనకబడి మద్దతునిస్తుంది. ఇలాంటి బోరింగ్ హోం వర్క్ చేసేందుకు సాయం ఎక్కడా దొరుకుతుందా అని పిల్లలు, తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ఆమెరికా పోరగాడొకడు పరిష్కారం కనుగొన్నాడు. ఈ పరిష్కారం అమెజాన్ డిజిటల్ అసిస్టెంట్ ఎలెగ్జా లో దొరికింది జెరియల్ కు. హోం వర్క్ నరకయాతనకు పరిష్కారం కనుగొన్నందుకు జెరియల్ ను హీరోని చేశారు.బాల మేధావి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.

వాళ్లమ్మ ఇంట్లో ఏదో పనిలో ఉన్నపుడు, హోంవర్క్ చేసిపెట్టమని ఎలెగ్జాను అడిగేశాడు. హంవర్క్ ఎలెగ్జా చెప్పినట్లు చేసేశాడు. చివర జెరియల్ ఎలెగ్జాకు ధాంక్స్ చెప్పేశాడు.

ఇది వాళ్లమ్మకు వినిపించింది. ఈ వీడియో క్లిప్ ని వాళ్లమ్మ ఎరెలిన్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. అంతే, అది వైరలయింది. డిసెంబర్ 20 తేదీన పోస్టు చేసి ఈ ట్వీట్ ను 4.78లక్షల మంది లైక్ చేశారు. 1.38 లక్షల మంది రీట్వీట్ చేశారు.