మార్చి నెల ఆఖరి కల్లా పూర్తి చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఇవే..?

ఏడాది ఫిబ్రవరి నెల పూర్తయి మార్చి నెల ప్రారంభం అయింది . అయితే ఈ నెల పూర్తవటంతో వచ్చే నెల కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోపు కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాకముందే ఈ నెల చివరి కల్లా ఏ ఏ పనులను పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైనది. అలాగే పాన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాలి. చాలా కాలంగా పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ మార్చి 31 వ తేది చివరి గడువు . ఒకవేళ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లదు. అప్పుడు మీకు పాన్ కార్డు లేనట్లే అవుతుంది. దీంతో ఆర్ధిక లావాదేవీల జరపటానికి వీలు ఉండదు. పాన్ కార్డు లేకుంటే బ్యాంకు అకౌంట్ కూడా తెరవరు. అలాగే ఐటీఆర్ రిఫండ్ రాదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే టీడీఎస్ వంటివి ఎక్కువగా కట్ అవుతాయి. పాన్ ఆధార్ లింక్ లేట్ ఫీజు రూ.1000గా ఉంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. అందుకే వెంటనే పాన్ కార్డ్ ని ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవాలి.

అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైనా ట్యాక్స్ సేవింగ్ పొందాలని భావిస్తే.. అందుకు అనుగుణంగా మార్చి 31లోపు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వివిధ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు..2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తుంది.. దీనికి సంబందించిన అప్డేట్ ను వెంటనే అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్ మార్చి 15 వరకు ఉంది. అందువల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే మార్చి 15 లోగా ఆ పని పూర్తి చేసుకోండి. వయ వందన యోజన స్కీమ్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. వెంటనే ఆ స్కీమ్ లో చేరండి.