నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో 210 అప్రెంటిస్ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ శిక్షణలో అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. నవంబర్ నెల 6వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 181 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 29 ఉన్నాయి. 210 ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,524 రూపాయల నుంచి 15,028 రూపాయల వరకు వేతనం లభించనుంది. సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

డిప్లొమా, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2024 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా 2024 సంవత్సరం నవంబర్ 6వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది. డిసెంబర్ నెల 7వ తేదీన అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి కానుండగా డిసెంబర్ 11 జాయినింగ్ తేదీగా ఉండనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సంస్థ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు.