పదికాలాలపాటు మీ బంధం హ్యాపీగా ఉండాలంటే… వ్యక్తిత్వాన్ని అసలు కోల్పోకండి!

ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహబంధం కానీ అన్నాచెల్లెళ్ల బంధం కానీ లేదా భార్యాభర్తల బంధం కానీ ఎక్కువ కాలం పాటు కొనసాగాలన్న మన బంధానికి త్వరగా బీటలు పారకూడదు అంటే మన వ్యక్తిత్వాన్ని అన్ని పరిస్థితులలోనూ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతామో ఆ సమయంలో మన బంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితులలోనైనా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఏ బంధంలోనైనా వ్యక్తిత్వం కోల్పోకూడదు అంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా పెళ్లి జరిగిన తర్వాత చాలామంది స్నేహితులను పూర్తిగా దూరం పెడతారు. అయితే ఇలా స్నేహితులను దూరం పెట్టడం మంచిది కాదు. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా గడపడం వల్ల కూడా మన బంధాలు మరింత బలపడతాయి. కొన్నిసార్లు మన జీవిత భాగస్వామితో చెప్పుకోలేనటువంటి సమస్యలను మన స్నేహితులు దగ్గర చెప్పుకోవచ్చు అలాంటి సమయంలోనే మన బంధం కూడా బలపడుతుంది.

ఇక చాలామంది ప్రతి రోజు ప్రతిక్షణం తమజీవితంలో జరిగినటువంటి అన్ని విషయాల గురించి వారి జీవిత భాగస్వామితో చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడం మంచిది కాదు. కొన్నిసార్లు ఈ విషయాలను వినడం వల్ల అవతలి వ్యక్తి ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఇక ప్రతి చిన్న విషయానికి కూడా జీవిత భాగస్వామి పైన ఆధారపడటం మంచిది కాదు కొన్ని పనులను కూడా ఒంటరిగా చేసుకోవడం వల్ల మన బంధం మరింత బలంగా ఉంటుంది.ఇక డబ్బు ఎలాంటి బంధాలనైనా చెడగొడుతుందనే విషయం మనకు తెలిసిందే. అందుకే భార్య భర్తలు ఇద్దరూ సంపాదిస్తూ ఉంటే వారిద్దరు జాయింట్ అకౌంట్ కాకుండా ఎవరి అకౌంట్ వాళ్ళకి ఉన్నప్పుడే డబ్బులు వద్ద ఏలాంటి మనస్పర్ధలు రావని వారి బంధానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పవచ్చు.