సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రేమలో పడి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మరికొందరు కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ప్రేమలో ఉన్న వాళ్ళు బ్రేకప్ చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ప్రేమలో ఉన్న వారి విషయంలో ఇలాంటి లక్షణాలు కనుక కనబడితే వారు తప్పకుండా బ్రేకప్ చెప్పుకుంటారని తెలుస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు కనబడితే బ్రేకప్ జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పుడైతే ప్రేమలో ఉన్న వారిపై ఒకరిపై మరొకరికి ఆకర్షణ తగ్గుతుందో ఆ సమయంలో ఇద్దరి మధ్య బ్రేకప్ ఏర్పడుతుందని అర్థం.ఇక మీ ప్రేయసి లేదా ప్రేమికుడు మీపై కాకుండా ఇతరులపై ఆకర్షణ చూపుతున్నారు అంటే ఇక మీరు ఆ బంధానికి స్వస్తి చెప్పుకోవడం మంచిది.ఇక మీ ప్రియుడు లేదా ప్రేయసి మిమ్మల్ని కలవాలని ఫోన్ చేసినప్పుడు తరువాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేయడం తను ఎన్నిసార్లు పిలిచినా కలవడానికి ఆసక్తి చూపకపోవడం వంటివి కనుక ఎదురైతే మీ ప్రియుడు లేదా ప్రియాసి మీకు బ్రేకప్ చెప్పడానికి సిద్ధమైనట్లే.
ఇక మీరు చేసే చిన్న చిన్న పనులకు కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే మీ ప్రేమ బంధం ఎక్కువ కాలం నిలబడదని అర్థం. అదేవిధంగా ఇద్దరు కలిసి ఒకే పని చేస్తున్నప్పుడు అందులో మీ నిర్ణయం తెలుసుకోకుండా ఆ పని ఒక్కరే పూర్తి చేసినప్పుడు కూడా మీ బంధానికి బీటలు బారుతుందని అర్థం.ఇక మనం చేసే ప్రతి ఒక్క ఖర్చు గురించి ఆరా తీయడం అలాగే మనం చేసే ఖర్చులపై అనుమానాలు తలెత్తాయి అంటే మన ప్రేమ బంధం ఎక్కువ కాలం నిలబడదని ఇలాంటి లక్షణాలు ప్రేమ బంధంలో ఉంటాయో ఆ ప్రేమికులు తక్కువ సమయంలోనే విడిపోతారని అర్థం.