ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోని ఈ దిక్కున పెడితే చాలు.. ఇక డబ్బే డబ్బు?

సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలోనే మనకు చేతనైన పని చేసుకుంటూ కష్టానికి తగ్గ ప్రతిఫలం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని భావించి ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి పూజ చేస్తుంటారు.ఈ క్రమంలోనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోని ఉంచి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. అయితే లక్ష్మీదేవి ఫోటోని సరైన దిక్కులో పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో అమ్మవారి ఫోటో ఎటువైపు ఉండాలి అనే విషయానికి వస్తే…

వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంచేటప్పుడు లక్ష్మీదేవి మొహం తూర్పు వైపుకు ఉండేలా ఏర్పాటు చేయాలి అంటే ఈ ఫోటోని పడమర దిశలో గోడకు అతికించాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో సానుకూలత పెరిగి ఇంటిపై పాజిటివ్ ఎనర్జీ ఉండటమే కాకుండా మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతుంది. ఇంట్లో మనం ఏ పనులు చేపట్టిన విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇకపోతే ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉండాలి అనే విషయానికి వస్తే..

లక్ష్మీదేవి అమ్మవారు తామర పువ్వు పై కూర్చుని ఇరువైపులా రెండు ఏనుగులు కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి ఫోటో ఎంతో శుభసూచికం. ఇక మన ఇంటి ప్రధాన ద్వారం బయట వైపు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇలా ఈ దీపాన్ని రాత్రంతా అలాగే ఉంచడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అమ్మవారి విషయంలో ఈ చిన్న మార్పులు చేయటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు.