ఏ పని మొదలుపెట్టిన పూర్తి కాకపోవడం, నర దోషాలు, దిష్టి దోషాలు లాంటివి ఏమైనా ఉండి విజయం పొందలేక ఆరోగ్యంగా ఉండలేక ఇంటిల్లిపాది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ ఒక్క పరిష్కారంతో సమస్యలన్నీ తీరిపోతాయి.
ఇంట్లో కలబంద మొక్కను ఉంచినట్లయితే ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు అనేది వాస్తు, పురాణ శాస్త్రాల ప్రకారం వాస్తవం. కలబంద ఆకులో లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో ఉంటుంది అంటారు పండితులు. మరి ఈ మొక్కను ఇంట్లో ఈశాన్యంలో ఉంచకూడదు. ఆగ్నేయం, వాయువ్యం దిశలలో ఉంచితే మంచిది.
ఈ కలబంద గుజ్జును శుక్రవారం రోజు సూర్యాస్తమయానికి ఒక 10 లేదా 20 నిమిషాల ముందు నీటిలో వేసుకొని స్నానం చేస్తే శరీరంలో ఉన్న రోగాలు, ఏవైనా దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సూర్యాస్తమం సమయంలో కానీ, ఆ తర్వాత కానీ కాకుండా ముందుగా పదినిమిషాలు ఉండగానే స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది.
తరువాత మంగళవారం నాడు ఉదయం 6 గంటల సమయంలో కలబంద మొక్కలను వ్యతిరేకంగా అంటే వేర్లు పైకి వచ్చే విధంగా గుమ్మానికి కట్టాలి. మనం గుమ్మం దగ్గర అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఆ చెట్టు యొక్క ముళ్ళు తల వెంట్రుకలకు కాస్త తగిలేలా కట్టాలి. ఎందుకంటే మనకు ఏదైనా దోషం గానీ, శని గాని ఉంటే అది తలపై ఉంటుంది. ఈ మొక్క తాకినప్పుడు దానికి పరిహారం లభించినట్టే.
కావున ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో ఈ కలబంద మొక్కలను ఉంచుకొని ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ పరిహారాలు చేసినట్లయితే అష్ట దరిద్రాలు పోయి ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు తిష్ట వేసి మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది నిజం అని పురాణాలలో వ్రాయబడింది.