నేల పైన కూర్చోవడానికి సంకోచిస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చేయరు!

ఆధునిక కాలంలో మనమందరం నేల పైన కూర్చొని పనిచేయడం చాలా అరుదనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో తినడం, రాయడం, చదవడం, టీవీ చూడడం వంటి రోజువారి పనులన్నీ కూర్చిలో లేక సోపాలో కూర్చుని చేస్తుంటాం. కానీ పూర్వపు రోజుల్లో మన పెద్దలు భోజనం చేయడం, చదువుకోవడం రాయడం వంటి పనులన్నీ నేల మీద కూర్చుని చేసేవారు దీనివల్ల మానసిక సామర్థ్యం, శారీరిక పుష్టి కలిగేదని అనేక అధ్యయనాల్లో స్పష్టమైనది. నేల పైన కూర్చుని చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుందని మన ఆయుర్వేద గ్రంధాల్లో స్పష్టంగా రాయబడింది. నేలపైన కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనం నేల పైన కూర్చుంటున్నాము అంటే మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి అవసరమైన కొన్ని
ఆసనాలు వేస్తున్నామని గుర్తుంచుకోవాలి.పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి అనువైన పొజిషన్స్. ఈ ఆసనాలు మనస్సు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ భంగిమల్లో కూర్చోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. నేల పైన కూర్చుని చదవడం, రాయడం అలవాటు చేసుకుంటే నాడీ వ్యవస్థ ,మెదడు కండరాలు అభివృద్ధి చెంది మనలో ఏకాగ్రత సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

నేల మీద కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ విషయం మన పూర్వీకులు ఆనాడే గుర్తించారు కాబట్టే నేల మీద కూర్చుని భోజనం చేసేవారు. కింద కూర్చొని భోజనం తినేటప్పుడు ముందుకు వెనుకకు వంచడం వల్ల పొట్ట కండరాలు ఉత్తేజితమై కడుపులో డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నేలపైన కూర్చున్న ప్పుడు వెన్నెముక పొజిషన్ నిటారుగా ఉండి అధిక ఒత్తిడి ఉండదు కావున భవిష్యత్తులో వెన్నెముక సమస్యలు తలెత్తవు.నేలపై కూర్చున్నప్పుడు శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నడుం కండరాలు, తొడ కండరాలు, మెడ కండరాలు బలిష్టంగా తయారై కీళ్ల సమస్యలు తొలగిపోతాయి.నేల పైన కూర్చునే అలవాటు ఉన్నవారి జీవితకాలం కూడా మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.