మన దేశంలో దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు రేషన్ కార్డులను కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఈ మధ్య కాలంలో బియ్యం మినహా ఇతర నిత్యావసర సరుకులు అందడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరే అవకాశం కలిగింది. ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే.
సబ్సిడీపై చక్కెర, కందిపప్పు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మార్కెట్ లో ఈ మధ్య కాలంలో కందిపప్పు రేటు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ లో కిలో కందిపప్పు 170 రూపాయల నుంచి 190 రూపాయల వరకు ఉంది. రేషన్ సరుకులు తక్కువ ధరకే పొందాలని భావించే వాళ్లు వచ్చే నెల నుంచి ఈ సరుకులు పొందవచ్చు.
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు మేలు చేయాలనే మంచి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని నిత్యావసర సరుకుల పంపిణీ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తోందని సమాచారం అందుతుండటం గమనార్హం. కిలో కందిపప్పును కేవలం 67 రూపాయలకే పొందవచ్చు.
చక్కెరను కేవలం 17 రూపాయలకే పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సబ్సిడీ ధరకే సరుకులు పొందే అవకాశం ఉండటం కొసమెరుపు. బియ్యం, కందిపప్పు ఇప్పటికే రైతుబజార్ల ద్వారా తక్కువ మొత్తానికి పొందే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.