శరీరానికి పక్షవాతం వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా!

మనిషి జీవితంలో పక్షవాతం అనేది తీవ్రంగా కలిసి వేస్తుంది. మనం అప్పుడప్పుడు శత్రువుకి కూడా పక్షవాతం రాకూడదు అని కోరుకుంటాం. పక్షవాతం వస్తే ఆ బాధ, ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టం. ఒక రకంగా ఇక జీవితం అయిపోయినట్టే. కొందరిలో మాత్రమే మొత్తం 90 శాతం వరకు కోలుకోవడం గొప్ప విషయంగా భావిస్తాము.

పక్షవాతం ఎలా వస్తుంది అంటే కండరాలకు అవసరమైన నరాలలో సేల్స్ అనేటివి చనిపోవడం, రక్త ప్రసరణలో వివిధ మార్పులు, ముఖ్యంగా కండరాలకు మెదడు నుండి సర్కులేట్ అయ్యే నరాలలో సెల్ చనిపోవడం లాంటి కారణాలతో కాళ్లు చేతులు నోరు పడిపోయి పక్షవాతానికి గురి అవుతారు.

అన్ కంట్రోల్డ్ డయాబెటిస్, అన్ కంట్రోల్ బిపి వల్ల నరాలు దెబ్బతిని అందులో సెల్ చనిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో కండరాలు గట్టిగా బిగుసుకుపోయి ఆ అవయవం సరిగా పని చేయదు. దీనినే పక్షవాతం అని అనుకోవచ్చు. కాబట్టి ముందుగా డాక్టర్ సలహా తీసుకొని డయాబెటిస్, బీపీని కంట్రోల్ చేసుకోవాలి.

డాక్టర్ చెప్పే మెడికేషన్ ను ఫాలో అవుతూ రోజులు ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. నాలుగైదు సార్లు పండ్లు, కూరగాయలు జ్యూస్ ను ఐసు, పంచదార లేకుండా తీసుకుంటే కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంది. ఇంకా ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులోని నరాలపై భారం పెరగడం వల్ల నరాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆలోచన విధానం మార్చుకొని టెన్షన్ పడకూడదు.

పక్షవాతం వచ్చిన చోటన కాస్త కొబ్బరి నూనె లేదా ఆముదం తీసుకొని చక్కగా మర్దన చేసుకోవాలి. వేడి నీటిలో బట్టను ముంచి కాపనం లాగా చేసుకుంటే ఆ అవయవంలో కండరాల కదలిక మొదలవుతుంది. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల త్వరగా పక్షవాతం నుండి కోలుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది. నరాలలో జరిగే మార్పుల వల్ల పక్షవాతం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు వస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఇవి తెలిసి పాటిస్తే ఆరోగ్యం.