చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే యాలకుల పేస్ ప్యాక్ .. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఈ ఆధునిక యుగంలో వేగంగా పరిగెడుతున్న జీవితచక్రంలో చాలామంది తమ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.రోజుల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, వేడి, ఆహారపు అలవాట్లులో వస్తున్న మార్పు , హార్మోన్స్ పనితీరు, చర్మంలోనీ నూనె గ్రంథుల పనితీరు,బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి చర్మ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

మార్కెట్లో లభించే వివిధ రకాల స్కిన్ బ్యూటీ ప్రొడక్టులను వాడుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.కొంతమంది ఎంతో కష్టపడి మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ముఖంపై ఆయిల్ కప్పేసి జిడ్డుచర్మం గా మారుతుంది. దాంతో ముఖంపై ఉన్న శ్వేత గ్రంధులు మూసి పోయి చర్మంపై మచ్చలు , మొటిమలు ఏర్పడతాయి. అయితే మన ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే యాలకులు, కొబ్బరి నూనె వంటి వాటితో కొన్ని ఇంటి చిట్కాలను పాటించి ముఖంపై జిడ్డు సమస్య ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు మసాలా దినుసుగానే కాకుండా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి.యాలకుల పొడిని పచ్చిపాలు మరియు తేనె మిశ్రమంలో కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకుని ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమలు ఉన్నచోట మర్దన చేయాలి. తరువాత 15 నిమిషాలకు చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా నశించి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

తాజా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర టేబుల్‌స్పూన్ నిమ్మరసం,ఒక టేబుల్‌స్పూన్ పెరుగును బౌల్లో వేసి బాగా కలిపి ముఖానికి మృదువుగా పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై జిడ్డు తొలగి ఆరోగ్య వంతమైన చర్మం మీ సొంతమవుతుంది.కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం ,యాంటీఆక్సిడెంట్లు చర్మంను పొడిబారకుండా మృదువుగా ఉంచుతాయి