మనం ఉదయం నుండి రాత్రి వరకు చేసే పనుల వల్ల, ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రాకూడదు అంటే కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత సడన్గా లేవకుండా కాసేపు కూర్చొని అప్పుడు లేవాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణలో మార్పు రాదు. బీపీ, షుగర్ పేషంట్లైతే కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది.
నిద్రలేచిన తర్వాత ముఖ్యంగా పళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఎలా పడితే అలా కాకుండా మృదువుగా పళ్ళు తోమినట్టయితే పళ్ళపై ఉండే ఎనామిల్ పాడవకుండా ఉంటుంది. ఆ తరువాత ఉదయం నుంచి 10 గంటల లోపు సూర్యరశ్మిలో నడవడం మంచిది. దీని ద్వారా విటమిన్-డి పుష్కలంగా అందుతుంది. తర్వాత వచ్చే ఎండ ద్వారా చర్మ సమస్యలు రావచ్చు.
కచ్చితంగా కాసేపు నడిచిన తర్వాత ఒక లీటరు నీళ్లు త్రాగితే, కడుపులోని ప్రేగులు శుభ్రం అయ్యి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. టీ తాగే అలవాటు ఉన్నట్లయితే కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత త్రాగితే మంచిది. లేదంటే పల్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఏదైనా అలవాటు మార్చుకోవాలంటే నెమ్మదిగా మార్చుకోవాలి సడన్గా మార్చుకుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ టీ ప్లేస్లలో గ్రీన్ టీ అయితే మంచిది. తరువాత కచ్చితంగా స్నానం చేయాలి. తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ సుచి స్నానం చేసినట్లయితే శరీరంపై ఉండే వ్యర్థాలు, నడవడం ద్వారా వచ్చిన చెమట అంతా పోయి శరీర కణాలు రీ ఫ్రెష్ అయ్యి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.
ఉదయం పూట ఫోన్లకు, టీవీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా ను జీవితంలో భాగంగా అలవరచుకున్నట్లయితే టెన్షన్లు ఒత్తిడి తగ్గి ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉంటుంది. దీని ద్వారా అనవసర డయాబెటిస్, బిపి వంటి రోగాలు దరి చేరవు. రోజు స్టార్ట్ అవ్వకముందే ఆరోజు చేసే పనులను ఒక ప్రణాళిక చేసుకుంటే ఆ రోజంతా సంతోషంగా ఉండవచ్చు.