జీవితంలో సంతోషంగా లేరా…. ఇవే ప్రధాన కారణాలు కావచ్చు!

మనలో శారీరక మానసిక ఆనందాన్ని పెంపొందించి ఒత్తిడిని దూరం చేయడంలో శృంగార కార్యకలాపాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం తో పాటు లైంగిక ఆనంద కూడా చాలా అవసరం
లైంగిక ఆనందాన్ని పొందలేని జంటల బంధం ఎక్కువ రోజులు నిలబడదు. మన నిత్య జీవితంలో అనేక కారణాలు లైంగిక ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ లైంగిక జీవితం ఆనందంగా లేకపోవడానికి మాత్రం కారణాలు చాలానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అందులో ప్రధానంగా ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొనే అంగస్తంభన సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు తన భాగస్వామితో లైంగిక ఆనందాన్ని పొందలేక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంగస్తంభన సమస్య సాధారణమైనది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ముందు మీలో ఒత్తిడి, భయాలను తొలగించి మీ భాగస్వామితో ప్రేమానురాగాలు పంచుకుంటే అంగస్తంభన సమస్య తొలగిపోతుంది. చాలామందిలో సెక్స్ డ్రైవ్ తగ్గడం వల్ల అంగస్తంభన, లైంగిక కార్యకలాపాల సమయంలో విపరీతమైన నొప్పి, లైంగిక సమయానికి సంబంధించి బలహీనత, ఉద్వేగం కోల్పోవడం వంటి అనేక కారణాలతో జంటలు లైంగిక కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉంటున్నారట.
లైంగికనందాన్ని పొందలేకపోవడానికి కారణం లైంగికంగా సంక్రమించే వ్యాధులు కూడా కారణం కావచ్చు. హెచ్ఐవి గనేరియా వంటి చాలా రకాల సుఖ వ్యాధులు సెక్స్ కార్యకలాపాల వల్ల సంక్రమిస్తుంటాయి.

ఈ రోజుల్లో ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు వీర్యం తొందరగా పడిపోవడం వల్ల సెక్స్ ఆనందాన్ని పొందలేకపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వీర్యం తొందరగా పడిపోయి భాగస్వామిని తృప్తి పరచలేక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంటారు.చాలా సందర్భాలలో, జంటలు తరచుగా సంభోగం అనుభూతిని ఆస్వాదించడానికి చాలా ఆత్రుతగా ఉంటారు. అప్పుడప్పుడు అది చాలా నెమ్మదిగా మారుతుంది, దీని వలన ఒకరు నిజంగా విసుగు చెందుతారు. మంచంపై వారి పనితీరును మెరుగు పరచడానికి నిర్దిష్ట లైంగిక స్పర్శ ,వ్యాయామాలలో పాల్గొనమని వైద్యులు సలహా ఇస్తున్నారు. లైంగిక ఆనందాన్ని పొందలేకపోతున్నామని మీరు భావిస్తే మొదట ఈ భాగస్వామితో చర్చించి అందుకు తగ్గ వైద్య సలహాలను తీసుకోవడం మంచిది.