మహిళలు వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి ఇవే కారణమా?

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం ఆ జంట ఎంతో అన్యోన్యంగా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఉండాల్సిన వారి కుటుంబం మొత్తం చిన్నభిన్నమవుతుంది.అయితే ఇలా మహిళలు పురుషులు ఇద్దరూ కూడా ఇతర వ్యక్తులతో ఆక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారు అయితే ముఖ్యంగా మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

చిన్న వయసులోనే మహిళలకు పెళ్లి చేయటం వల్ల పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి ఇబ్బంది పడటం లేదా పిల్లల విషయంలో భర్త నుంచి సపోర్ట్ లేకపోవడం,వంటి కారణాలవల్ల మహిళలు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు.ఇక తన భర్త ఎప్పుడు ఏదో ఒక మూడులో ఉంది భార్యను పట్టించుకోకపోవడం లేదా లేనిపోని కారణాలతో వారిని బాధ్యురాలిని చేసే తిట్టడం వంటివి చేయటం వల్ల ఇలా మహిళలు ఇతర వ్యక్తులకు దగ్గరవుతారని పలు సర్వేలు తెలియజేశాయి.

ఇక భర్త ఇప్పుడు కూడా భార్యకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తన తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తూ తల్లిదండ్రులు చెప్పినదే వింటూ భార్యను ఒక పని చేసే వ్యక్తిగా మాత్రమే భావించే భర్త దొరికినప్పుడు ఆ భార్య తన భర్త నుంచి ఏ మాత్రం ప్రేమ ఆప్యాయతలు గౌరవం వంటివి దొరకనప్పుడు మహిళ మరొక వ్యక్తికి దగ్గరవుతుంది. ఎప్పుడైతే ఇంట్లో మహిళలకు నచ్చిన విధంగా చెయ్యలేదో అలాంటి సమయంలో వారు మానసికంగా కృంగిపోతారు అదేవిధంగా ఇంట్లో సరైన గుర్తింపు వారికి లభించకపోయిన అలాంటి గుర్తింపు, ప్రాధాన్యత లభించే వైపు వాళ్ళు మొగ్గు చూపుతారు.