ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 424 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలలో 169 ఉద్యోగ ఖాళీలు సూపర్ స్పెషాలిటీలో భర్తీ కానుండగా బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనుండటం గమనార్హం. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం. ఫిబ్రవరి నెల 6వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వాకిన్ రిక్రూట్మెంట్ జరగనుందని తెలుస్తోంది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వాకిన్ ఇంటర్వ్యూను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. మిగతా ఉద్యోగ ఖాళీలకు మాత్రం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.