ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4033 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వరి సేకరణ సేవల కోసం రెండు నెలల కాలానికి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా ఈ ఉద్యోగాలకు అర్హత కాగా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటం గమనార్హం. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.
ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ కార్యాలయాలలో దరఖాస్తు సమర్పించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే సమీపంలోని ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ కార్యాలయాలను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలలో కొన్నిరోజుల క్రితమే వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ జాబ్ కోసం ఎదురుచూసేవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే సులువుగానే ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.