ఏపీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. భారీ వేతనంతో 250 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 250 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. వేర్వేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఈ నెల 13వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీబీఎస్ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది.

ఆన్ లైన్ ద్వారా సులువుగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రింట్ అవుట్ ను జాగ్రత్తగా భద్రపరచుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు వేతనం భారీ రేంజ్ లో ఉండనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.