ప్రస్తుతం యువత చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారు. ఏ విషయంలోనైనా కాస్త మనసుకి ఇబ్బంది అనిపించినా ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గాతీసుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. అందుకు కారణాలు లేకపోలేదు. అది వారు పెరిగే వాతావరణమో ఏంటో తెలియదు. కాని కొందరయితే తల్లిదండ్రులు చిన్న మాట అన్నా కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఏకంగా వారి తనువును చాలించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పరీక్షల్లో మార్కులు తక్కువచ్చినా ప్రస్తుతం రోజుల్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఒకమాట అనాలన్నా చాలా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో ఏదైనా ఒక మాట అన్నా కాసేపు బాధపడ్డా నా తల్లిదండ్రులేగా అని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుటి జనరేషన్ అలా లేదు. అందుకే తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది.
ఇక ఆరోగ్య విషయంలో కూడా అంతే సెన్సిటివ్‌గా ఉంటున్నారు. కాస్త వర్షంలో నానినా, కొంచం చలిగాని ఎండగాని ఎక్కువగా వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఇప్పటి పిల్లలో ఉంది. అప్పట్లో వర్షం వస్తే ఎంతో సరదాగా పిల్లలందరూ వర్షంలో ఆడుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలేదు. ఒకరకంగా చెప్పాలంటే వాతావరణ కాలుష్య ప్రభావం కాస్తుంటే. పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇబ్బంది కూడా ఎక్కువగానే ఉంది. ఓ భారీ సమస్యను ఎదురీదే పరిస్థితిలో కూడా లేక పోవడం గమనార్హం. సమస్యలు వస్తే.. అల్లాడిపోవడం.. ఆత్మహత్యలకు ఒడిగట్టడం సర్వసాధారణంగా మారిపోయింది.
అదే విధంగా కాస్త ఆనందమైన విషయం తెలిస్తే చాలు ఇక వారిని ఎవ్వరూ అడ్డుకోలేరు అన్న విధంగా ఎంజాయ్ చేస్తారు. ఎంతలాగా అంటే ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చేందుకు తల్లిదండ్రుల జేబులకు చిల్లలు పడేంత.