సూర్య, పూజా హెగ్డే..ఈ భారీ బ్యానర్ లో అదిరిపోయే సినిమా అట.!

Suriya did good job by doing Surarai Pottru

తమిళ్ స్టార్ హీరో సూర్య కి మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడో తన సినిమాలతో మన దగ్గర కూడా మంచి వసూళ్లను అందుకుంటున్న సూర్య ఈసారి కాస్త డల్ అయ్యాడు. కానీ లేటెస్ట్ “విక్రమ్” లో క్యామియో తో మాత్రం దుమ్ము లేపేసాడు. దీనితో తన నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు రెండు సినిమాలు తన లైన్ లో పెట్టుకున్న సూర్య ఆ రెండు సినిమాల తర్వాత ఎవరితో చేస్తున్నాడు? ఏ సినిమా అనే ఇతర డీటెయిల్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇక వీటి ప్రకారం అయితే సూర్య నెక్స్ట్ దర్శకుడు శివ తో సినిమా ఓకే చేసాడట.

తమిళ్ లో శివ చాలానే సూపర్ హిట్ సినిమాలు చేసాడు. మరి ఇపుడు ఈ కాంబోలో సినిమా ఓకే అవ్వగా అందులో హీరోయిన్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వీటికి మించిన న్యూస్ ఏమిటంటే ఈ చిత్రాన్ని భారీ సినిమాల నిర్మాణ సంస్థ అణా తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో నిర్మాణం వహించనున్నారట.

అలాగే ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ నేపథ్యంలో ఉండే సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తంగా చూసినట్టు అయితే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేలా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎలా లేదన్నా రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.