విషాదం : నటి మీనాకి ధైర్యం చెబుతున్న ప్రముఖ స్టార్ నటులు.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లో ప్రముఖ సీనియర్ నటి మీనా కూడా ఒకరు. అయితే మీనా ఇప్పుడు పలు చిత్రాల్లో తనకి తగ్గ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తెలుగు మరియు తమిళ్ లో లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో “దృశ్యం 2” అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో “పెద్దన్న” చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. 

అయితే ఇలా సినిమాలు అలాగే తన ఫ్యామిలీ తో పర్సనల్ మరియు ప్రొఫిషినల్ లైఫ్ లో సాఫీగా వెళ్తున్న మీనా ఇంట ఇపుడు తీరని విషాదం నెలకొంది. తన  ముక్కలయ్యే వార్తే ఇది అని చెప్పాలి. తన ప్రాణనానికి ప్రాణం అయినటువంటి తన భర్త విద్యా సాగర్ నిన్న రాత్రి చెన్నై ఆసుపత్రిలో మరణించడం షాకింగ్ గా మారింది. 

అయితే విద్యా సాగర్ కి లంగ్ ఫెయిల్యూర్ కారణంగా మరణించగా ఈ వార్త విని వెంకటేష్ సహా అనేక మంది స్టార్ నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేష్ ఈ వార్త విని విస్మయానికి లోనయ్యానని మీనా గారికి వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నానని విచారం వ్యక్తం చేశారు. అలాగే స్టార్ హీరో విశాల్ కూడా మీనా కుటుంబానికి నివాళులు అర్పించారు. 

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నేరుగా మీనా ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ వార్త విని అనేకమంది సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మీనా కుటుంబానికి తమ ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం మీనా కుటుంబంలో ఒక తీరని లోటు అని చెప్పి తీరాలి.