ఇండస్ట్రీ టాక్ : విజయ్ “వరిసు” సినిమాకి సెన్సేషనల్ ప్రీ రిలీజ్ బిజినెస్.?

మన తెలుగు పవన్ కళ్యాణ్ మహేష్ బాబులు ఎలాగో అటు తమిళ నాట సినిమా దగ్గర కూడా తలపతి విజయ్ మరియు థలా అజిత్ కుమార్ లు కూడా అంతే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రికార్డులు వీరి సొంతం. అయితే ఈ హీరోస్ లో మహేష్ బాబు ఆల్రెడీ తమిళ్ లో స్పైడర్ తో ఎంట్రీ ఇవ్వగా..

ఇప్పుడు విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో వరిసు అనే బై లాంగ్వేజ్ సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం తెలుగులో కూడా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే విజయ్ సినిమాలు అంటేనే భారీ బిజినెస్ కన్ఫర్మ్ గా జరుగుతుంది తమిళ్ లో తన సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఆడుతూ ఉంటాయి.

ఇక ఈ సినిమాకి కూడా సెన్సేషనల్ బిజినెస్ జరుగుతున్నట్టు సినీ వర్గాల్లో ఇపుడు టాక్ వచ్చింది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే ఏకంగా 150 కోట్లు పలికినట్టుగా అంటున్నారు.

ఎలాగో తెలుగులో తక్కువే ఉండొచ్చు కానీ తమిళ్ లో మాత్రం ఎలా లేదన్న 120 నుంచి 150 కోట్లు బిజినెస్ జరగొచ్చు. మరి దీనిపై సరైన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అయితే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.