‘హిడింబ’ మొదటిసారి చూసిన వారికి సరికొత్త అనుభూతిని ఇస్తుంది: అశ్విన్ బాబు

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రిమియర్స్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో అశ్విన్ బాబు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమాకి ‘హిడింబ’ అనే పేరు పెట్టడానికి కారణం ?
వాస్తవానికైతే ఈ కథకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ కావాలి. కానీ ఐప్పటికే ఈ పేరుతో సినిమాలు వచ్చాయి. ఆ స్థానంలో మరో పేరు కోసం అన్వేషించినపుడు ‘హిడింబ’ అనే పేరు ఐతే బావుంటుదని భావించాం. దీని అర్ధం కూడా రాక్షసుడు అనే అర్ధానికి దగ్గరగా వుంటుంది. దీనికి చారిత్రక నేపథ్యం కూడా వుంది. సినిమాలో ప్రేక్షకులని యంగేజ్ చేస్తాం, సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇద్దామనే దృష్టితోనే ఈ కథని యాక్సెప్ట్ చేశాను. నిన్న వేసిన ప్రిమియర్స్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన అందరూ చాలా బావుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది.

డైరెక్టర్ అనిల్ గారు ఈ కథతో ఎప్పుడు సంప్రదించారు ?
కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత కాల్ లోనే ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. ఐతే అప్పటికే మా నిర్మాత శ్రీధర్ గారితో ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ అనుకున్నాం. కానీ కరోనా కారణంగా స్టేడియమ్స్ పర్మిషన్స్, అలాగే ఫారిన్ లొకేషన్స్ కుదురుతాయా లేదా ? అనే సందేహం వుండేది. అందరం ఒకే అభిప్రాయానికి వచ్చి ‘హిడింబ’ కథ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఈ సినిమా చేసే క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?
ముందుగా ఈ సినిమా నిర్మాత గంగపట్నం శ్రీధర్ గారి గురించి చెప్పాలి. హీరోకి చాలా ప్రధానత్య ఇచ్చే నిర్మాత ఆయన. ఆయనకి ఏది అడిగినా .. ‘ హీరో గారు కావాలంటే ఇచ్చేయండి, హీరో గారిని అడగండి’ ఇలా ఆయన అనడంతో నాపై తెలియకుండానే ఒక బరువు, బాధ్యత పెరిగింది. ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయనకి విజయం దక్కాలని ప్రతి క్షణం కోరుకున్నాను. ఈ సినిమాని ఆయన అత్యున్నతంగా నిర్మించారు. అలాగే ఓంకార్ అన్నయ్య ఏది చేసిన కొత్తగా చెయ్ అని చెబుతుంటారు. ఈ రెండు ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశా. అందుకే ఈ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా ఒప్పుకోలేదు.

మీరు ఎక్కువగా హారర్ , థ్రిల్లర్స్ చేస్తారు .. ఆ జోనర్స్ మీకు ఇష్టమా ?
రాజు గారి గది ఫ్రాంచైజ్ గాని మీరు పరిశీలిస్తే అందులో నేను చేసిన పాత్రలు దేనికవి డిఫరెంట్ గా వుంటాయి. పాత్రలో వైవిధ్యం ఉంటేనే చేస్తాను. హిడింబలో చూస్తే నా ముందు సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త వేరియేషన్ చూస్తారు. నలుగురుని కొట్టినా నమ్మొచ్చు అనే పాత్రలో నన్ను ప్రిపేర్ చేశారు డైరెక్టర్. ఇప్పటివరకూ సినిమా చూసిన ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. అందరూ ఆదరిస్తారనే నమ్మకం వుంది.

రివర్స్ ట్రైలర్ ఆలోచన ఎవరిది ?
ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచే బిజినెస్ ఓపెన్ అయ్యింది. ఐతే రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ వుంటే బావుంటుందని అభిప్రాయం వచ్చింది. ఇది థ్రిల్లర్. ఇలాంటి సినిమాలకి ట్రైలర్ లో ఎక్కువ కంటెంట్ ని చూపించలేం. ఐడియా బావుంటేనే మరో ట్రైలర్ రిలీజ్ చేద్దాం లేకపోతే వద్దు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు నాలుగు ఐడియాలతో వచ్చారు. అందులో రివర్స్ ట్రైలర్ ఆలోచన చాలా నచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేసిన కరెక్ట్ గా సింక్ అయిన షాట్స్ ని రివర్స్ ట్రైలర్ గా రిలీజ్ చేశాం. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రిమియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?
అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేము ఏదైతే కంటెంట్, కాన్సెప్ట్ ని నమ్మి చేశామో , ప్రిమియర్స్ చూసిన ఆడియన్స్ కూడా వాటిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ , ఫైట్స్ , మ్యూజిక్ , ట్విస్ట్ లు అన్నీ బావున్నాయని చెబుతున్నారు. మొదటిసారి ఈ సినిమా చూసిన వారికి కాన్సెప్ట్ కంటెంట్ ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్ళి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. రెండోసారి సినిమా చూసిన వారికి అద్భుతమైన స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

మీరు ఎంచుకున్న కథలు గురించి అన్నయ్యకి చెబుతారా ?
ఖచ్చితంగా. నేను విన్న కథల్లో నాకు నచ్చిన కథలని అన్నయ్య కి చెబుతాను. హిడింబ కథని కూడా విన్నారు. ఆయనకి చాలా నచ్చింది.

అనిల్ సుంకర గారి సపోర్ట్ ఎంతవరకు వుంది ?
వ్యక్తిగా అనిల్ సుంకర గారి గురించి ఒక మాట చెప్పాలి. సినిమా పట్ల ఆయనకి వున్న అంకితభావం అద్భుతం. రాజీపడకుండా రిలాక్స్ అవ్వకుండా పని చేస్తుంటారు. అనిల్ సుంకర గారి లాంటి ప్రొడ్యుసర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా నిజాయితీ గల నిర్మాత. అనిల్ గారు లాంటి నిర్మాత మాతో జాయిన్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కొత్తగా చేయబోయే సినిమాలు ?
మెడికల్ మాఫియా థ్రిల్లర్ నేపధ్యంలో సినిమా వుంటుంది. అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్