వీడియో: బాతు గుడ్డు పొదిగిన పురుషుడు.. ఇదెక్క‌డి విచిత్రం అంటూ ముక్కున వేలేసుకుంటున్న నెటిజ‌న్స్

ప్ర‌పంచంలో ప్ర‌తి రోజు ఎన్నో విచిత్రాలు, వింత‌లు జ‌రుగుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. వంద‌ల ఏళ్ళ క్రితం బ్ర‌హ్మంగారు అనే కాల‌జ్ఞాని చెప్పిన‌ట్టు ఇప్పుడు అలానే జ‌రుగుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నకు మ‌హిళ‌లు మాత్ర‌మే పిల్ల‌ల‌ను ప్ర‌స‌విస్తార‌నే విష‌యం గురించి అవ‌గాహ‌న ఉంది. కాని ఇప్పుడు ఓ పురుషుడు బాతు గుడ్డుని పొదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇది విన‌డానికి కాస్త షాకింగ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ, తన‌కున్న మేధా శక్తితో అది చేసి చూపించాడు.

‘ఎ చిక్ కాల్డ్ అల్బర్ట్’ అనే యూట్యూబర్‌కు బాతు గుడ్డుని పొదిగి ప్రాణం పోయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా గుడ్డును పొదిగి బాతుకు ప్రాణం పోసాడు. అనుకున్న‌ది సాధించాడు. అదెలా సాధ్య‌మైంది అనే విష‌యం గురించి అత‌ను మాట్లాడుతూ…బాతుల‌ని పెంచ‌డం నాకు అల‌వాటు. ఆ మ‌ధ్య కొన్ని బాతు గుడ్డ‌ని క‌రెంట్ సాయంతో పొదిగేలా ఏర్పాటు చేశాను. కాని కరెంట్ స‌మ‌స్య ఉండ‌డం వ‌ల‌న నా ఆలోచ‌న ఫెయిల్ అయింది. దీంతో నాకొక ఆలోచ‌న వ‌చ్చింది. మ‌న శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త బాతు గుడ్డు పొద‌గ‌డానికి స‌రిపోతుంది క‌దా అనుకున్నాను. ఇందులో భాగంగా వాటిని నా శ‌రీరానికి అంటించుకునే ప్ర‌య‌త్నం చేశాను. స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయి. నా బాడీ హీట్‌కు గుడ్డు బాతులా మారింది.

జ‌రిగిన త‌తంగాన్ని అంతా ఎ చిక్ కాల్డ్ అల్బ‌ర్ట్ వీడియో తీసి ఇటీవ‌ల యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఇది జ‌నాల‌ని ఎంత‌గానో ఆక‌ర్షించింది. అత‌ని ప్ర‌య‌త్న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మాన‌వుడు అనుకుంటే సాధించ‌లేనిది ఏది లేదంటూ ఎ చిక్ నిరూపించాడు అని కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ ప్ర‌యోగంతో ప్ర‌స్తుతం అత‌ను ఒక సెల‌బ్రిటీగా మారాడు.