డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్’.పిల్లలకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటి లయిన్ కింగ్. ఇప్పటికే చాలా సార్లు హాలీవుడ్ ఈ కథని తెరకెక్కించి సొమ్ము చేసుకుంది. దాదాపు ప్రతీ ఐదేళ్లకు ఓ కొత్త వెర్షన్ తో అదే కథని తిప్పి చెప్తూ బిజినెస్ చేసుకుంటుంది డిస్నీ స్టూడియో. ఇదిగో ఇప్పుడు మరో సారి తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యింది.
1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్దలను, పిల్లలను విశేషంగా ఆకట్టుకునే ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్‌లు వాయిస్ ఇవ్వడం విశేషం. ఇక తెలుగులో జగపతి బాబు, రవిశంకర్, నాని, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. దానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. దానిపై మీరు ఓ లుక్కేయండి.
తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ ట్రైలర్ పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది.