నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?

ఈ సృష్టిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి అయితే కొన్ని పక్షులను దైవ సమానంగా భావిస్తాము అలా దైవ సమానంగా భావించే వాటిలో నెమలి ఒకటి. నెమలి జాతీయ పక్షిగా గుర్తింపు పొందడమే కాకుండా నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాహనంగా ఉంది. అందుకే నెమలిని కూడా దైవ సమానంగా భావిస్తారు. ఇకపోతే నెమలిలో చూడగానే నెమలి ఈకలు మనకు చాలా ముచ్చటగా అనిపిస్తాయి.అయితే చాలామంది నెమలీకలను ఇంటిలో అలంకరణగా ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరి మాత్రం నెమలీకలను ఇంట్లో పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు.మరి నెమలీకలను ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

నెమలి దైవ సమానమైన పక్షిగా భావిస్తారు కనుక నెమలీకలు ఇంట్లో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నెమలి పించం ఎల్లవేళలా శ్రీకృష్ణుడు తలపై ఎంతో అలంకారంగా ఉంటుంది.వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి పించం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంటికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పాలి. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వారి దిండు కింద నెమలి పించం పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇక మన ఇంట్లో నెమలి పించాన్ని తూర్పు లేదా ఈశాన్యంలో పెట్టడం వల్ల ఎప్పటినుంచో పరిష్కారం కానటువంటి వివాదాలు కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి.మన ఇంట్లో వినాయకుడి విగ్రహానికి ఎదురుగా నెమలి పించం ఉండటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే గ్రహ దోషాలతో బాధపడేవారు నెమలి పించం పై 21సార్లు నీటిని వేసి గ్రహానికి చెందిన మంత్రాలు చదవటం వల్ల గ్రహ దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.ఇలా నెమలి పించం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని చెప్పాలి.