ప్రతిరోజు ఉదయాన్నే స్వచ్ఛమైన తాజా తాటికల్లు లేదా ఈత కల్లు తాగేవారు జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని నమ్మలేక ఆశ్చర్యపోతున్నారా. అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి. సాధారణంగా ఆటలమ్మ, చికెన్ ఫాక్స్ వంటి సీజనల్ వ్యాధులు సోకినప్పుడు ఈత కల్లు లేదా తాటికల్లును తాగించడం లేదా ఒంటిపైన రాసుకోవడం చేస్తుంటారు. అంటే ఇందులో అలర్జీలను, ఇన్ఫెక్షన్లను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయనే కదా అర్థం. ప్రతిరోజు తాటికల్లును సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాటికల్లును సేవించే ముందు అది స్వచ్ఛమైనదా కాదా కచ్చితంగా తెలుసుకోవాలి. కల్లును చెట్టు నుంచి తీసిన రెండు గంటల లోపే తాగాలి. అలాకాకుండా పులిసిన కల్లును తాగితే అనారోగ్యానికి కారణం కావచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కల్లులో ప్రమాదకర బ్యాక్టీరియాలు వృద్ధి చెంది మత్తును కలిగించడంతోపాటు ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. అందుకే అలాంటి తాటి కల్లుజోలికి అస్సలు వెళ్ళకండి.తాజా తాటికల్లును తాగినప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని గుర్తుంచుకోండి.
తాజా స్వచ్ఛమైన తాటికల్లులో జీర్ణాశయ ఇన్ఫెక్షన్లను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను నయం చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మూత్రశయ ఇన్ఫెక్షన్లు తొలగి మూత్రం వెళ్ళినప్పుడు మంట రక్తం పడడం వంటి సమస్యలను నివారిస్తుంది. తాటి కల్లులో మన శరీరంలో వ్యాధి కారకాలను నశింపజేసే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.తాటికల్లులో ఉండే చఖరో మైసెస్ అనే సూక్ష్మ జీవికి ఉదర క్యాన్సర్ కు కారణం అయ్యే ఒబిఎస్ 2 అనే క్యాన్సర్ కారకాన్ని నశింప చేస్తుంది. బ్యాక్టీరియా సంబంధమైన డయేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులను అదుపు చేయడంలో తాటికల్లు ఔషధంలా పనిచేస్తుంది. మన శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా కాపాడుతుంది. అయితే తాజా తాటికల్లును మాత్రమే తాగడానికి ఉపయోగించాలి ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి.