అఖిల్ కు ఫ్లాఫ్ ఇచ్చినా, నితిన్ సినిమా ఇచ్చాడు

వరుణ్‌తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై రూపొందిన చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అదే ఉత్సాహంతో అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే చిత్రం చేసారు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం స్క్రిప్టు రాసుకుంటూ కూర్చున్న వెంకీ అట్లూరి ఇప్పుడు నితిన్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు నితిన్, వెంకీ అట్లూరి వీళ్లిద్దరి మధ్య తాజాగా కథాచర్చలు ముగిశాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం ఇదే బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాకు కమిట్ అయ్యాడు నితిన్.

ఈ ప్రాజెక్టుకు సంభందించి మరో విశేషం ఏంటంటే.. వెంకీ అట్లూరి-నితిన్ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందట. ఈ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. మూవీలో హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందట. అందుకే కథ విన్న వెంటనే కీర్తిసురేష్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి అఫీషియల్ గా ఓ ప్రకటన రానుంది.