సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్ద తమ వెనక ఉంది అంటే ఏ దర్శకుడు అయనా ఉత్సాహంగా, ధైర్యంగా సినిమా చేస్తాడు. అలాగే గుణశేఖర్ కూడా హిరణ్యకశిప ప్రాజెక్టుని మెదలెట్టారు. అయితే ఇప్పుడు సురేష్ బాబు రకరకాల కారణాలు చూపెట్టి తప్పుకున్నారట. దాంతో గుణశేఖర్ కు అంత పెట్టుబడి పెట్టే నిర్మాత, లేదా ఫైనాన్సియర్ పట్టుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది.
వాస్తవానికి రుద్రమదేవి తర్వాత రానా దగ్గుబాటి ప్రధాన పాత్ర లో గుణశేఖర్ దర్శకత్వం లో ప్రతాపరుద్రుడు అనే సినిమా ప్లాన్ చేసారు…. కానీ సురేష్ బాబు సూచన మేరకు ..గుణశేఖర్ తన ప్లాన్ మార్చి ఇప్పుడు హిరణ్యకశిప స్క్రిప్టు రెడీ చేసారు. సుమారు గా మూడేళ్ళు ఈ సినిమా కి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు.
కాగా ఇప్పుడు ఈ సినిమా కి దాదాపు గా 150 కోట్లు పైగా బడ్జెట్ అవుతుందని లెక్కలు వేసారు గుణశేఖర్. మొదట నుంచి ఈ సినిమా ని నిర్మిస్తానని చెప్తూ వచ్చిన సురేష్ బాబు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారట. సురేష్ బాబుతో పాటు బాలీవుడ్ నుండి ఫాక్స్ స్టార్ అనే సంస్థ ని కూడా ఈ సినిమా ని నిర్మించడానికి భాగస్వామి ని చేసాడట. అయితే అప్పటికీ సురేష్ బాబు విముఖత చూపుతూ ఉండటం తో, ఫాక్స్ స్టార్ అనేది ఎంత వరకూ తనతో ప్రయాణం చేస్తుందనేది సందేహంగా మారిందిట. అప్పటికీ ధైర్యం చేసి గుణశేఖర్ కూడా తాను కూడా భాగస్వామ్యమవుతానని మాట ఇచ్చాడట. సురేష్ బాబు కండీషన్స్ , రూల్స్ కు ఒప్పుకుని గుణశేఖర్ రాజీ పడి సినిమా చేస్తారా లేక వేరే ప్రొడ్యూసర్ ని పట్టుకుని సినిమా పూర్తి చేస్తాడా చూడాల్సి ఉంది.