సుకుమార్ కు అల్లు అర్జున్ నుంచి బ్యాడ్ న్యూస్

సుకుమార్ కు అల్లు అర్జున్ నుంచి బ్యాడ్ న్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఈ సినిమా తర్వాత ఏ డైరక్టర్ తో బన్ని సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లోనూ ఉంది. అయితే ఈ షూటింగ్ పూర్తవగానే సుకుమార్ తో సినిమా చేస్తారని అంతా భావించారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం…బన్ని నెక్ట్స్ ప్రాజెక్టు సుకుమార్ తో కాదని తేలిపోయింది.

మరి ఎవరితో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా చేయబోతున్నారు అంటే వేణు శ్రీరామ్ తో అంటున్నారు. దసరా రోజున ఈ సినిమా లాంచ్ అవనుంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఐకాన్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కనబడుటలేదు’ అన్నది ట్యాగలైన్. ఈరోజు గతంలోనే ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే జూన్ దాకా ఈ చిత్రం ఈ సినిమా పనుల్లో ఉంటారు. అప్పుడే సుకుమార్ తో సినిమా స్టార్టవుతుంది. రంగస్దలం వంటి హిట్ ఇచ్చిన రెండేళ్ళ ఖాళీగా ఉండాల్సిన సిట్యువేషన్ సుకుమార్ ది కావటం అభిమానులను బాధించే అంశం.

మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారన్న విషయం నిజమేనని అల్లు అర్జున్ టీమ్ పేర్కొంది. ఇందులో హీరోయిన్ గా గా రష్మిక మందనను ఎంపిక చేశారు. ‘అల్లు అర్జున్‌ 20వ చిత్రం. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. సౌత్‌ సెన్సేషన్‌ రష్మిక మందన కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌పై రష్మిక స్పందిస్తూ..‘సో.. ఎగ్జైటెడ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చాయి.