నమ్మచ్చా : శ‌ర్వానంద్‌ ప్లే బాయ్?

చిన్న సినిమాలకు పెద్ద హీరో శర్వానంద్. ఆయన సినిమాలకు మినిమం గ్యారెంటి ఉంది. అందుకు కారణం ఆయనకు యూత్ లో ముఖ్యంగా ఆడపిల్లలలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే. చక్కటి ప్రేమ కథలకు ఆయన ఫెరఫెక్ట్ ఎంపికగా దర్శకులు ఫీలవుతూంటారు. అయితే శర్వానంద్ కు విభిన్నమైన పాత్రలు, యాక్షన్ క్యారక్టర్స్ తో కూడిన సినిమాలు చేయాలనేది కోరిక. అందులో భాగంగానే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శర్వానంద్ ప్లే బాయ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ శర్వా అలాంటి పాత్రను చేయలేదు. ఈచిత్రంలో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో న‌డిచే ఈ సినిమాలో ప్లే బాయ్ గా, ఏజ్డ్ గ్యాంగ్ స్ట‌ర్‌గా… శ‌ర్వానంద్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని తెలిసింది. ప్లే బాయ్ షేడ్స్ ఉన్న‌ప్పుడు అత‌ని పాత్ర‌కి జోడీగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌నిపిస్తుంద‌ని… ఇక‌ గ్యాంగ్ స్ట‌ర్ షేడ్స్ ఉన్న‌ప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ జోడీగా ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని టాలీవుడ్ సమాచారం.

ఎప్పుడో మొదలైన ఈ సినిమా రీషూట్ల పై రీషూట్లు చేస్తుండడంతో చాలా డిలే అవుతోందని వార్తలు వస్తున్నాయి. పడిపడిలేచే మనస్సు చిత్రం డిజాస్టర్ కావటంతో అసహనానికి గురైన శర్వా సుధీర్ వర్మ ఇప్పటివరకూ షూట్ చేసిన అవుట్ పుట్ చూసి కొంత బాగాలేదని టైమ్ తీసుకొని స్క్రిప్ట్ పై మళ్ళీ వర్క్ చేయమని చెప్పాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది.

శ‌ర్వానంద్ ఈ ఏడాది రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. వాటిలో ఒక‌టి… సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా… మ‌రొక‌టి `96` రీమేక్‌. ఈ రెండు సినిమాలు కూడా త‌క్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సినిమా మే నెల‌లో విడుద‌ల కానుండ‌గా… `96` రీమేక్ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.