‘సరిలేరు నీకెవ్వరు’: కోప్పడి వెళ్లిపోయిన జగపతిబాబు

‘సరిలేరు నీకెవ్వరు’:డైరక్టర్ చేసిన పనికి సినిమా వదిలేసిన జగపతిబాబు

విలక్షణ నటుడు జగపతి బాబు సాధారణంగా చాలా కూల్ గా ఉంటారు. ఎలాంటి విషయమైనా చాలా జాగ్రత్తగా డీల్ . సెట్ లో తన పని తప్పే వేరేదానిలో వేరు పెట్టరు. అందుకే ఆయనంటే డైరక్టర్స్ కు ఇష్టం. అలాంటిది ఆయన కోపం తెచ్చుకుని షూటింగ్ నుంచి వేరే వాళ్లను చూసుకోండి అని వెళ్లిపోయారంటే..ఆయన ఎంత హర్ట్ అయ్యి ఉంటారు. అసలేం జరిగింది..

వివరాల్లోకి వెళితే…. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుంచి జగపతిబాబు తప్పుకొన్నారు. ఈ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. సినిమాలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లను కీలక పాత్రల్లో ఎంపికచేశారు.

అయితే సినిమా మొదట్లో చెప్పిన తన పాత్రను దర్శకుడు ట్రిమ్ చేసి తగ్గించేయటంతో, ప్రాధాన్యత లేదని భావించిన జగపతిబాబు సినిమా నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. చిన్న పాత్రలు, ప్రాధాన్యత లేని పాత్రలు ఆయన చేయనని తేల్చి చెప్పినట్లు సమాచారం. దాంతో ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను ఎంపికచేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ఇందులో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. దిల్‌రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.